Monday, 2 November 2026

ఇరురాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఆమె శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని, దేశం దాటిన నల్లధనాన్ని తిరిగి వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీతారామన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామన్నారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *