ఆదిలాబాద్, జూన్ 7 : జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలోని ఆరు మండ లాల్లో సోయా విత్తనాల కోసం పెద్ద సంఖ్యలో రైతులు విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరారు. శనివారం నుంచి విత్తనాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విత్తనాల కొరత ఏర్పడుతుందని భయంతో రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే విత్తనాల కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే విత్తనాల కొరత లేదని రైతులు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. గత ఏడాది దిగుబడి ఎక్కువగా రావడంతో ఈ విత్తనాలపై రైతులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.




