హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు భారీగా రోగులు చేరుకున్నారు. చేప ప్రసాదం కొరకు ఇతర రాష్ర్టాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బత్తిన సోదరులు మాట్లాడుతూ రేపు సాయంత్రం వరకు చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




