
వణుకుతున్న ఉత్తరాది
న్యూఢిల్లీ, జూన్ 18 (జనంసాక్షి) :
ఉల్లిఘాటు నరేంద్రమోడీ సర్కారుకు ఆదిలోనే చిక్కులు తెచ్చిపెడుతోంది. సామాన్యునిడికి నిత్యా వసరమైన ప్రభుత్వాల తల రాతలను మార్చేదిగా పేరుగాంచిన ఉల్లి మరోమారు ఢిల్లీ పెద్దలను వణికిస్తోంది. ఉల్లి ధరలు మరోమారు భగ్గుమనే పరిస్థితులు తలెత్తుతుండడంతో ప్రభుత్వ తక్షణం అప్పమత్తమై ఉల్లి ధరలను నియంత్రించేందుకు సమాయత్తమైంది. ముందుగ ఉల్లి ఎగుమతులపై నియంత్రణ విధించింది. దీనిలో భాగంగానే ఉల్లి కనీస ఎగుమతి ధరను వెల్లడించింది. దీని ప్రకారం ఇకపై టన్ను ఉల్లిని 300 డాలర్ల కనీస ఎగుమతి ధరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ అమ్మకాలను నియంత్రిం చి దేశీ రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియం త్రిచాలని భావిస్తోంది. ఢిల్లీలో 15రోజుల క్రితం ఉల్లి ధర 15-20 రూపాయల మధ్య ఉండగా, ప్రస్తుతం అది 25-30
రూపాయలకు చేరుకుంది. ఇదిలా ఉంటే గత యూపీఏ ప్రభుత్వం మూడు నెలల క్రితమే ఉల్లి ఎగుమతుల ధరను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ధరలు మెల్లమెల్లగా పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించింది. దేశం నుండి సగటున 15 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతుల ధరను నిర్ణయించడం వలన ధరలు అదుపులో ఉంటాయని భావిస్తోంది. అయితే ఉల్లిధరలు ఇప్పటికిప్పుడు అమాంతంగా పెరగకపోయినప్పటికీ ఈ చర్యల వలన కాస్త అదుపులో ఉంటాయిన ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా రబీ సీజన్‌లో పండించిన 39 లక్షల ఉల్లి గోదాముల్లో ఉన్న కారణంగా ధరల పెరుగు దలకు అవకాశం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా దేశంలో నెలవారీ ఉల్లి విని యోగం 12 లక్షల వరకూ ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కూలీల సమ్మెలో ఉల్లి ధరల పెరుగుదల?
దేశంలోని అతిపెద్దదైన ఉల్లి మార్కెట్ నాసిక్‌లోని లాసన్‌గావ్‌లో ఉంది. ఇక్కడి కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టడంతో ఉల్లిధరలు విపరీతంగా పెరుగుతాయనే సంకేతాలు వెలువడు తున్నాయి. కూలీల సమ్మె కారణంగా ఉల్లి ఎగుమతులు నిలిచిపోయి ధరలు అమాతం పెరుగుతాయని అధికారులు భావించారు. అయితే కూలీలు తమ డిమాండ్లు నెరవేరడంతో సమ్మెవిరమించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ప్రస్తుతానికి సమస్య సద్దు మణిగింది.
మళ్లీ ఉల్లిఘాటు




