Tuesday, 3 November 2026

గవర్నర్ల తొలగింపు దుమారం

gavarner
కేంద్రాన్ని కలుస్తున్న ‘యూపీఏ’ గవర్నర్లు
న్యూఢిల్లీ, జూన్‌ 18 (జనంసాక్షి) :
యూపీఏ ప్రభుత్వం నియ మించిన గవర్నర్లను మోడీ సర్కా రు ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తుండటం రాజకీయ దుమా రాన్ని సృష్టిస్తోంది. వయసురీత్యా కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించలేకపోయిన మురళీ మనోహర్‌ జోషికి త్వరలోనే గవర్నర్‌ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. గతంలో మానవ వనరుల శాఖలో పనిచేసిన ఆయన రాజ్యాంగ పరంగా అనుభవం కలిగి ఉంటుందని బీజేపీ భావిస్తోంది. యూపీఏ నియమించిన గవర్నర్‌ల నేరుగా తొలగించే అవకాశం లేకపోవడంతో రాజీ నామా చేయాలని సంకేతాలను పంపించింది. మంగళవారం అంతటా
దేశ రాజధానిలో ఇదే చర్చ జరిగింది. దీంతో గనవర్నర్‌ తొలగింపు అన్న తీగను పట్టుకున్న మీడియా చానళ్లన్నీ వారికున్న సోర్సెస్‌ ప్రకారం ఆయా చానళ్లలో ప్రైమ్‌ టైంలో అరగంట పాటు స్టోరీలు నడిపాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ గరవర్ణర్‌ జోషి రాజీనామా సమర్పించారు. మరోవైపు షీలాదీక్షిత్‌ వ్యతిరేకించారు కూడా. మరోవైపు కర్నాటక, యూపీ గోవా రాష్ట్రాలకు గవర్నర్‌లను నియామకం చేసే పనిలో పడింది ఎన్‌డీఏ ప్రబుత్వం. గవర్నర్‌గా నియమించబడే కొందరు ప్రధాని మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌తో హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌, మార్గరేట్‌ అల్వా, కమాలా బేణీవాల్‌, బీపీ పట్నాయక్‌లు బేటీ అయ్యారు. కేంద్రహోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి కొంతమంది గవర్నర్‌లకు ఫోన్‌ చేసి ప్రభుత్వ ఆలోచనలు తెలియజేశారు. ఈ తరుణంలో కొన్ని రాష్ట్రాలకు బీజేపీ గవర్నర్‌లను నియమించాలని ఎన్‌డీఏ ప్రభుత్వ సూచన. 2010 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్‌ను కేంద్రం ఏకపక్షంగా తొలగించరాదు. ఈ నేపథ్యంలోనే వారంతటవారే రాజీనామా చేయాలన్నది ఎన్‌డీఏ ప్రభుత్వ ఆలోచన. 2010లో కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణం నుంచి రక్షించడానికే యూపీఏ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ సీఎం షీలాదీక్షిత్‌ను గవర్నర్‌గా నియమించారన్నది బీజేపీ ఆరోపణ. ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగన్ను నేపథ్యంలో ఆలోపే అక్కడి గవర్నర్‌ శంకర్‌నారాయణ్‌ను సాగనంపాలన్నది మోడీ ప్రభుత్వ భావన ఆయన స్థానంలో మురళీమనోహర్‌ జోషిని గవర్నర్‌గా పంపాలని బీజేపీ మదిలో మెదులుతున్న ఆలోచన. అయితే మంగళవారం జరిగిన పరిణామాలను కాంగ్రెస్‌, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదంటూ పేర్కొన్న బీజేపీ 2004లో అదికారంలోకి వచ్చిందన్న యూపీఏ ఇదే పనిచేసిందని గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *