Wednesday, 4 November 2026

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల పదవీ విరమణ వసుసు పెంపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకే ఈ బిల్లు అని ఆయన చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నాయని తెలియజేశారు. ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని సీఎం ఆకాంక్షించారు. విభజన సమయంలో ఉద్యోగుల పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు. ఉద్యోగుల సమ్మె కాలాన్ని సెలవుగా పరగణిస్తామని ఆయన చెప్పారు. రిటైరైన ఉద్యోగులకు ఇళ్లు కట్టించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యతులో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *