
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యం
దళితులకు మూడెకరాల భూమి పంపిణీకి చర్యలు
ఆగస్టు 15 ముహూర్తం శ్రీకలెక్టర్లతో సీఎం సమావేశం
హైదరాబాద్, జూన్ 24 (జనంసాక్షి) :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇప్పటి వరకూ న్యాయం జరు గలేదని, వారి సంక్షేమానికే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమి స్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల పాలన కంటే తమ పాలన పూర్తిగా విభిన్నం, వినూ త్నంగా ఉంటుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షే మమే ప్రధాన లక్ష్యమని ఈ దిశగానే తమ పాలన ఉంటుందని తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుతో పాటు దళిత సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్ట ర్లను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని ఈ దిశగా అధికార యంత్రాంగా కృషి చేయాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ సచి వాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. తన ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై చర్చిం చారు. మూడెకరాల భూమి అందించేందుకు అందుబాటులో ఉన్న భూమి వివరాలు సేకరించి, నివేదిక ఇవ్వాలని సూచిం చారు. కొత్త రేషన్ కార్డుల జారీ, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లలో చోటు చేసుకున్న అక్రమాలను నిరోధించాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వివరాలను అడిగి తెలుసు కున్న కేసీఆర అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హావిూని నెరవేరుస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఇందుకు అవస రమైన విధివిధానాలు, సలహాలు, సూచనలు అందించాలని కలెక్ట ర్లను కోరారు. పారదర్శక పాలన అందిస్తామని, పాలనలో రాజకీ య జోక్యం ఉండబోదని కేసీఆర్ హావిూ ఇచ్చారు. అధికారులు మెరుగైన పాలన కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని, ఇందులో పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రానీవ్వబోమన్నారు. జిల్లా స్థాయి నిర్ణయాలను సత్వరమే తీసుకుంటూ ప్రజలకు ఇబ్బం దులు లేకుండా చూడాలని ఆదేశించారు. రేషన్ కార్డులు, సామా జిక పింఛన్లలో చోటు చేసుకున్న అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు రూ.3 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మించే అంశంపై కేసీఆర్ కలెక్టర్‌తో చర్చించారు. సకల సౌకర్యాలతో
బలహీనవర్గాల కాలనీల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తక్కువ వ్యయంతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు.
జిల్లాల్లో వ్యవసాయ స్థితిగతులు, వర్షాభావ పరిస్థితులపై సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులకు లోటు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే హామీపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను ఏ విధంగా వినియోగించుకోవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాలని, కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని సూచించారు. భూముల రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవినీతి, అక్రమాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.




