Tuesday, 3 November 2026

నీటి వివాదంపై సీఎస్‌తో సీడబ్ల్యూసీ చైర్మన్‌ భేటీ

dfgdgds
హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :

కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) రంగం లోకి దిగింది. రెండు రాష్ట్రాలతో సంప్ర దింపులు ప్రారంభించింది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ ఏబీ పాండ్య మంగళవా రం రెండు ప్రభుత్వాలతో చర్చించారు. తొలుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి రాజీవ్‌ శర్మతో ఆయన సమావేశ మయ్యారు. డెల్టాకు నీటి విడుదలపై ప్రభుత్వ అభ్యంతరాలను తెలుసుకున్నా రు. సమస్యను సావధానంగా పరిష్కరిం చేందుకు ఉన్న

మార్గాలపై సీఎస్‌తో చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుతోనూ భేటీ అయ్యారు. కృష్ణా జలాల విడుదల వివాదంపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనను సేకరించారు. మరోవైపు, రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి పారుదల శాఖల ఉన్నతాధికారులతోనూ పాండ్యా సమావేశమయ్యారు. ఓవైపు, కేంద్ర జల సంఘం సంప్రదింపులు కొనసాగుతుండగానే మరోవైపు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. కృష్ణ జలాల విడుదల వివాదంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అలాగే, మంత్రివర్గ విస్తరణ, ఢిల్లీ పర్యటన వివరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఈ కమిటీలు ఆచరణలోకి రావడానికి మరింత సమయం అవసరమవడంతో గవర్నర్‌ రెండు రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాల కోసం కృష్ణా డెల్టాకు పది టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించింది. జూన్‌ 25 నుంచి జులై 9 వరకు పది టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించింది. అయితే, నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అధికారుల స్థాయిలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్న ప్రభుత్వం తాగునీటి కోసమని పది టీఎంసీలు నీరు విడుదల చేస్తే వాటిని నారుమళ్లకు మళ్లిస్తారని పేర్కొంటోంది. నారుమళ్ల కోసమని మళ్లీ నీరు అడుగుతారని అభ్యంతరం చెబుతోంది. తాగునీటి కోసమైతే రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి పేషీలో అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అయితే, నీటి విడుదలపై కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్‌ సర్కారు యోచిస్తోంది.

నీటి విడుదలకు ఏపీ సన్నాహాలు

బుధవారం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉండడంతో ఆంధ్రరప్రదేశ్‌ ప్రభుత్వం ఆ మేరకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఎలాగైనా నీటిని విడుదల చేయించుకోవాలని కసరత్తు ప్రారంభించింది. కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేయాలన్న ఉన్నత కమిటీ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఉన్న అంశాలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే నాగార్జునసాగర్‌ కుడి కాలువ దగ్గర ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను మోహరించింది. పది టీఎంసీల నీటి విడుదలకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోతే సాగర్‌ కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు సన్నాహాలు చేపట్టింది. మరోవైపు, కేంద్ర జల సంఘం ద్వారా కేసీఆర్‌ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నత స్థాయి కమిటీ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయించాలని కేంద్రం ద్వారా ఒత్తిడి చేయిస్తోంది.

రాజకీయం తగదు : దేవినేని

కాగా, నీటి విడుదలపై వివాదం కొనసాగుతుండగానే వివాదం కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కృష్ణా డెల్టాకు బుధవారం నుంచి జూలై 9 వరకు పది టీఎంసీల తాగునీటిని విడుదల చేయాలనే నిర్ణయం ఇప్పటిది కాదన్నారు. రాష్ట్రపతి పాలన సమయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు దాహార్తిని తీర్చే సున్నితమైన అంశంపైనా రాజకీయ వివాదం చేయడం తగదని తెలిపారు. సకాలంలో నీటి విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *