హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా తయారుచేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ పాలసీని మరింత సమగ్రంగా రూపొందిస్తామన్నారు. మూడు రంగాలకు సంబంధించిన ఐటీ కంపెనీలతో రేపు రాత్రి ఏడు గంటలకు నగరంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయరంగంపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ కోసం 20 లక్షల టన్నుల సామర్థంగల అధునాతన గోడౌన్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.




