హైదరాబాద్: రైతులకు విద్యుత్ కొరత రాకుండా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్గాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి నేరుగా తెలంగాణకు విద్యుత్ లైన్ వేస్తామని, విద్యుత్ కొనుగోలుపై రెండు మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు.
నగరంలో చెత్త కనిపించకుండా చూడాలి
క్లీన్ హైదరాబాద్‌పై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చెత్త కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా 12 నుంచి 15 డంపింగ్ యార్డులు ఏర్పాటుచేయాలన్నారు. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు సేకరించాలని ఆదేశించారు. హిమాయత్ నగర్‌లో కలుషిత నీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పొరుగు రాష్గాలనుంచి విద్యుత్ కొనుగోలు చేస్తాం: కేసీఆర్





