Tuesday, 3 November 2026

నువ్వు పుడితే కుదరదు

nuvu
నీ అయ్య కూడా పుట్టుండాలి 
56కు ముందున్నోళ్లే తెలంగాణోళ్లు 
ముల్కీ నిబంధనలపై చర్చ 
బేఫికర్‌గా ఉండుండ్రి 
పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్‌ కొంటాం 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 
హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) : 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం మరింత స్పష్టతని చ్చింది. విద్యార్థి తెలంగాణలో పుట్టినంత మాత్రాన అత డిని లోకల్‌ క్యాండిడేట్‌గా పరిగణించబోమని అతడి తండ్రి కూడా తెలంగాణాలోనే పుట్టి ఉండాలని, అలాం టి వారికి మాత్రమే ఫీజులు రీ యింబర్స్‌ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయిం బర్స్‌మెంట్‌, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తదిత ర అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్‌రావు గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్షిం చారు. విద్యార్థుల తండ్రి స్థానికత, ముల్కీ నిబంధనలపై చర్చించారు. 1956కు ముందు స్థిరపడిన వారిని మాత్రమే తెలంగాణ వారిగా గుర్తించాలని కీలక నిర్ణ యం తీసుకున్నట్టు సమాచారం. అయితే స్థానికత అం శంపై న్యాయ పరమైన ఇక్కట్లు ఎదురుకాకుండా ఉం డేందుకు న్యాయ సలహా తీసుకోవాలని సీఎం సూచిం చారు. రెండు, మూడు రోజుల్లో విద్యార్థుల స్థాని కతకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని ఆయ న అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యాసం వత్స రం నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యల తలెత్త కుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. గురువారం సచివాల యం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జెన్‌కో సీ ఎండీ ప్రభాకరరావు, సదరన్‌ సీఎండీ ఫయిద్‌ రిజ్వీ ఉన్నతాధికారులతో విద్యుత్‌ పంపిణీపై సమీక్షించారు. అవసరాలకు సరిపడా విద్యుత్‌ అందుబాటులో లేదని అధికారులు చెప్పారు. వర్షాలు లేనందున మే మా సంలో ఎలాంటి వాతావరణం 
ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ, అవసరమైన విద్యుత్‌ను సమకూర్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు దక్షిణాది గ్రిడ్‌లో ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి విద్యుత్‌ను పొందే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులతో తానే స్వయంగా చర్చిస్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ కొనుగోలుచేసే విషయంలో తక్షణం స్పందించాలని, ఖర్చుకు కూడా వెనకావద్దని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్‌ అందుబాటులో ఉన్నందున అక్కడి నుంచి విద్యుత్‌ తీసుకొచ్చే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణాకు నేరుగా విద్యుత్‌ లైన్‌ కూడా వేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ నుంచి మహారాష్ట్రలోని వార్దా వరకు లైన్‌ ఉన్నందున వార్దా నుంచి డిచ్‌పల్లి వరకు విద్యుత్‌ లైన్‌ నిర్మిస్తే సరిపోతుందని సమీక్షలో నిర్ణయానికి వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎంతమేర విద్యుత్‌ తీసుకోవచ్చో అనే అంశంపై కూడా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో తానే స్వయంగా చర్చించాలని నిర్ణయించారు. అవసరమైతే రెండు, మూడు రోజుల్లో తానే నేరుగా ఛత్తీస్‌గఢ్‌ వెళ్ళి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాలతో విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ స్వయం సమృద్ధి సాధించుకునే వరకు ఇతర రాష్ట్రాల నుంచి పొందాలని, రాష్ట్రంలో పూర్తిస్థాయి విద్యుత్‌ అందుబాటులోకి వచ్చాక అవసరమైతే మిగతా రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే విధంగా లైన్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మణుగూరు, రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లిలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ వివరాలను, భవిష్యత్‌లో ప్రారంభించే ప్లాంట్ల పురోగతిని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటికిప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే భవిష్యత్‌ అవసరాలను తగిన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకుపోవాలని సూచించారు. క్లీన్‌ హైదరాబాద్‌ తమ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చెత్తరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. క్లీన్‌ హైదరాబాద్‌పై గురువారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చెత్త కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా 12 నుంచి 15 డంపింగ్‌ యార్డులు ఏర్పాటుచేయాలన్నారు. డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు సేకరించాలని ఆదేశించారు. హిమాయత్‌ నగర్‌లో కలుషిత నీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌ నగరాన్ని క్లీన్‌ హైదరాబాద్‌గా రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌రంగంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం క్లీన్‌ హైదరాబాద్‌పై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ చెత్త డంపింగ్‌ యార్డులను 12-15 వరకు ఏర్పాటు చేయాలన్నారు. డంప్‌ యార్డుల కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గండిపేట, హిమాయత్‌సాగర్‌ల్లోకి కలుషిత నీరు చేరకుండా చూడాలన్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల్లో కలుషిత నీరు చేరుతోందని, ఆ రెండూ మరో హుస్సేన్‌సాగర్‌లా మారకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో ఆయన గురువారం నాడు సవిూక్షించారు. హైదరాబాద్‌ పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కనీసం 12 నుంచి 15 డంపింగ్‌ యార్డులను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. డంపింగ్‌ యార్డుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని తెలిపారు. నగర పరిధిలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *