
3 నుంచి 5 వరకు చైర్మన్ల ఎన్నిక
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :
స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల రెండో అంఖానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరతీసింది. సుదీర్ఘకాలం నిరీక్షన అనంతరం స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెండు రాష్టాల్రుగా విడిపోయిన తరవాత ఇప్పుడు వేర్వేరుగా ఎన్నికల షెడ్యూల్ కాకుండా ఒకే షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. జులై 3న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక. ఉంటుంది. జులై 4న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదేవిధంగా జులై 5న జిల్లా, మండల పరిషత్ వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఎన్నిక లను జూలై మొదటి వారంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమా యత్తమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రత్యక్ష ఎన్నికల ఫలి తాలు వెల్లడై నెలన్నర రోజులు గడుస్తున్నా.. పరోక్ష పద్ధతిలో జరిగే చైర్‌పర్సన్ల ఎన్నిక లు ఇంకా జరగలేదు. ఈమేరకు జడ్పీ, ఎంపీపీ పరిషత్ చైర్మన్ ఎన్నికలకు ఈసీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నిక లు ముగిసిన అనంతరం సుదీర్ఘ కసరత్తు చేసిన ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుద ల చేసింది. జులై 3న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు, ము న్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అనంతరం జులై 4న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండగా, జులై 5న జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని ఈసీ పేర్కొంది. రాష్ట్ర విభజన
చట్టంలో ఎన్నికల సంఘం ప్రస్తావన లేకపోవడంతో ఇంతకాలం రాష్ట్ర ఎన్నికల సంఘం సందిగ్ధంలోనే ఉంది. ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఖమ్మం జిల్లా మండల, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికను ఎన్నికల సంఘం నిలిపివేసింది. జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ వచ్చిన నేపథ్యంలో బూర్గంపాడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేతో మండల, జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక నిలిచిపోయింది.
పరిషత్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్




