హైదరాబాద్ : లేక్‌వ్యూ అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కరవు, నగరం దుర్ఘటన, రుణమాఫీ, బోధనారుసుం చెల్లింపు, స్థానికసంస్థల పాలకమండళ్ల ఎన్నికలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.




