Monday, 2 November 2026

పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ)కి భారత రత్న ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు తమ కేబినెట్‌లో ఒక తీర్మానం చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ నెక్లెస్‌రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి వద్ద నిర్వహించిన పీవీ నరసింహరావు 93వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పీవీ చేసిన సేవలు మరువలేనివని పొగిడారు. అందుకే భారత ప్రభుత్వం ఆయనకు అత్యంత విశిష్ట పౌరపురస్కారం భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఢిల్లీలో పీవీ పేరుతో ఒక స్మారకాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక జిల్లాకు పీవీ పేరు పెడతామని, ఒక యూనివర్సిటీని కూడా నిర్మిస్తామని ప్రకటించారు.

పీవి తన పాలనలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన చేసిన సంస్కరణలు నేటికి దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివద్ధికి దోహదపడుతున్నాయని శ్లాఘించారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్ పీవీ జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహించడం సముచితమని వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *