Monday, 2 November 2026

జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న మోడీ

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్రమోడీ మొదటిసారి జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మోడీ జులై 4వ తేదీన జమ్ము చేరుకొని అక్కడి నుంచి సమీపంలోని కత్రా పట్టణంలో కత్రా-ఉదంపూర్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. ఆయన ఒక్కరోజు పర్యటనలో మోడీతో పాటు కేంద్రమంత్రులు సదానంద్ణొడ, జితేంద్ర సింగ్‌ వెళ్లనున్నారు. రైల్వే లైను ప్రారంభించిన అనంతరం మోడీ శ్రీనగర్‌ చేరుకొని భద్రత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *