హైదరాబాద్: అన్ని జిల్లాల చిన్న నీటిపారుదలశాఖ అధికారులతో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త రాష్ట్రంలో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. చిన్న నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయండి. కాంట్రాక్టర్ల కోసం పనులు సృష్టిస్తే ఊరుకునేది లేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతమైతే సహించమని పేర్కొన్నారు.




