చెన్నైలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ
చెన్నై, జూన్ 30 : చెన్నైలో పదకొండు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తిని రెస్క్యూ టీం శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఆరుగురు తెలుగు వారు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని సిబ్బంది రక్షించగా వీరిలో 25 మంది గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. దాదాపు వెయ్యి మంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జయలలిత ప్రభుత్వం ఆదేశించింది.




