Monday, 2 November 2026

సరయూ నదిలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు గల్లంతు

7604pj09జ‌నంసాక్షి: బియాస్ ఘటన మరువక ముందే మరో ఇద్దరు విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. అయోద్య సరయూ నదిలో పడి ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయ్యారు. యాగం కోసం నదిలో స్నానానికి వెళ్లి అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మల్కాజ్ గిరి వేద పాఠశాలకు చెందిన 50మంది విద్యార్థులు రెండు రోజుల క్రితం యాగం కోసం అయోద్య వెళ్లారు. గల్లంతైన విద్యార్థులు కిరణ్ , చక్రపాణిగా గుర్తించారు. కాగా ఈ ఘటన సరయూ నది లక్ష్మణ్ ఘాట్ వద్ద జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *