ముంబై, జులై 2 : స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో ఉన్నాయి. ఏషియా మార్కెట్లు జోరు మన మార్కెట్లపై అనుకూల ప్రభావం చూపింది. బ్యాకింగ్, మెటెల్, చెమురు రంగ షేర్లు బాగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు అయిన 25,735 పాయింట్లకు కేవలం 3 పాయింట్లు తక్కువగా 25,732 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో 200 పాయింట్ల పెరుగుదల నమోదైంది. నిఫ్టీ ఆరు పాయింట్లు పెరిగి 7,694 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.




