మొహమ్మద్ అలీ చైర్మన్‌గా జిఓఎం ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు మార్గదర్శకాలను, నియమ నిబంధనలను సూచించడానికి మంత్రుల బృందాన్ని(జిఓఎం) తెలంగాణ ప్రభుత్వం బుధవారం నియమించింది. రెవెన్యూ శాఖతోపాటు డిప్యుటీ ముఖ్యమంత్రి గా ఉన్న మొహమ్మద్ అలీ చైర్మన్‌గా జిఓఎంను నియమిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.భూ సేకరణకు సంబంధించిన నియమ నిబంధనలు, భూసేకరణ యంత్రాంగాన్ని జిఓఎం ఖరారు చేస్తుంది. సాధ్యమైనంత త్వరగా జిఓఎం తన సిఫార్సులను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిఓఎంలో ఇతర సభ్యులుగా ఆర్థిక, నీటిపారుదల, పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రులు ఉంటారు. కన్వీనర్‌గా ప్రిన్సిపల్ సెక్రటరీ(రెవెన్యూ) ఉంటారు. భూ పరిపాలన శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.సిసిఎల్ఎ స్సెషల్ కమిషనర్, వ్యవసాయ కమిషనర్, రిజిస్ట్రేషన్ ఐజి, న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి, నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ నుంచి రేష్మా నాయర్, పునర్నిర్మాణ, పునరావాస కమిషనర్ జిఓఎంకు సహాయపడతారు.