రంగారెడ్డి, జులై 5 : జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో జెడ్పీ ఎన్నికపై ఆది నుంచి ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 జెడ్పీస్థానాలు ఉండగా, కాంగ్రెస్14, టీఆర్ఎస్ 12, టీడీపీకి 7 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ యావవ్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ 13 సభ్యుల బలాబలాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోసిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ రెండూ సమన్వయ పొత్తుతో ముందు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇరు పార్టీ మ«ధ్య చర్చల నేపథ్యంలో ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.




