
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచారం జరిగింది. తన మేనత్త ఇంట్లో పాచి పని చేసే పనిమనిషిని కూడా ఓ కామాంధ కస్టమ్స్ అధికారి వదిలిపెట్టకుండా అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటన వివరాలను పరిశీలిస్తే.. లక్నోలో కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై కన్నేశాడు.
దీంతో గత కొన్ని నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. 20 రోజుల క్రితం ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను విచారించిన పోలీసులు, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా, తన మేనత్తను సరిగా చూసుకోనందుకు ఆమెను పనిలోంచి తొలగించామని, అందుకే తనపై అత్యాచార ఆరోపణలు చేస్తోందని సుశీల్ కుమార్ సరికొత్త వాదన తెరపైకి తెచ్చాడు.




