Tuesday, 3 November 2026

తెలుగు రాష్ట్రాలకు కొత్త రైళ్లు ఇవే

 కొత్తగా 5 జనసాధారణ,5 ప్రీమీయం,27ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

   న్యూఢిల్లీ, జూలై 8 : 2014-15కు సంబంధించిన రైల్వే బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మంగళవారం పార్లమెంట్‌లో ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే అభివృద్ధికి తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ. 20 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సదానందగౌడ తెలిపారు. రైల్వే రిజర్వేషన్లలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మొబైల్స్, పోస్టాఫీసుల ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించునున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా 5 జన సాధారణ, 5 ప్రీమీయం, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రైళ్లు ఇవే…
నాగపూర్ – సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు,  చెన్నై – హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు, సికింద్రాబాద్ – నిజాముద్దీన్ ప్రీమియం రైలు, విశాఖ – చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు, పారాదీప్ – విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  విజయవాడ – ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *