Tuesday, 3 November 2026

‘మోడీ’ వచ్చిన నాటి నుంచి తెలంగాణకు అన్యాయమే..

హైదరాబాద్ : మోడీ ప్రధాని అయిన నాటి నుంచి తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు తెలంగాణపై విషపూరితమైన కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని వేణుగోపాలచారి విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ సిఎస్‌కు కేంద్ర రాసిన లేఖలో ‘టి’ సిఎస్ రాజీవ్ శర్మ పేరుకు బదులుగా ఏపీ సిఎస్ అని పేర్కొనడం కేంద్ర హోం శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆయన ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *