Tuesday, 3 November 2026

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..

కాజీపేట డివిజన్, సికింద్రాబాద్ ఆధునీకరణ ప్రస్తావనేది?
హైదరాబాద్ (ఇఎన్ఎస్): కేంద్రం బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణలోని కాజీపేట డివిజన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాస్తవనే లేదని దుయ్యబట్టారు. కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీ గుర్తించి ఒక్క మాటకూడ లేదని మండిపడ్డారు. ఇప్పటికే సర్వేలు పూర్తయిన ప్రాజెక్టులను నిధులు కేటాయించలేదని, ఎంఎంటిఎస్ పునరుద్ధరణకు కేటాయించిన రూ. 20 కోట్లు ఏమాత్రం సరిపోవని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *