హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోని అత్యధిక జనాభా గల నగరాల్లో భారత దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం జపాన్‌లోని టోక్యో నగరానిది. 1990 దశకం నుంచి ఇప్పటివరకు ఢిల్లీ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువైందని ఈ అంశంపై అధ్యయనం జరిపి వెలువరించిన ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంటోంది. వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ అనే ఈ నివేదిక నిన్న విడుదలైంది. 2050 నాటికి భారతదేశంలో పట్టణాలన్నీ అత్యధిక జనాభా కలిగివుంటాయని, భారత్ ఈ విషయంలో చెయనాకన్నా ముందుంటుందని ఈ నివేదిక పేర్కొంటోంది.




