Tuesday, 3 November 2026

రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ జేఏసీ పిలుపు

హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టంపై తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఈ చట్టాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులతో మాట్లాడారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్‌ను బంద్ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులపై దాడి చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో ఇవాళ జరిగింది అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *