ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో ఈనెల 28న కారులో ఉంచిన రూ. 8కోట్ల నగదు ఎత్తుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థిరాస్తి సంస్థ ఉద్యోగులు బ్యాంకులో డిపాజింట్ చేసేందుకు కరోల్ బాగ్ వెళుతుండగా లాజ్ పత్ నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో దుండగులు కారును అడ్డగించి రూ. 8 కోట్ల నగదు అపహరించిన విషయం తెలిసిందే.




