Tuesday, 3 November 2026

8 బస్సులు సీజ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఎపిఇఎంఎస్‌): నిబందనలకు విరుద్ధంగా ప్రయాణికులను చేర వేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై రవాణ శాఖ కొరడా ఝుళిపిస్తూనే ఉంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని గగన్‌ పహాడ్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో 8 బస్సులు అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ బస్సులను సీజ్‌ చేశారు. అక్రమంగా బస్సులు నడిపిస్తే కఠిన చర్యలు తప్పబోవని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *