Tuesday, 3 November 2026

భవనంలో గ్యాస్‌ లీకై పేలడంతో 8మంది మృతి

బుయినోస్‌ ఐరిస్‌: అర్జంటీనాలోని రొసారియా పట్టణంలో ఓ భవనంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనంలోని 8 మంది మృతి చెందగా, మరో 62 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీమ్స్‌తో సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. గ్యాస్‌ లీకై పేలుడు సంభవించిందేమోనని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *