కోయంబత్తూర్: ఈరోజు తెల్లవారుజామున తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో స్థానిక దేవాలయంలో దర్శనం అనంతరం ఓ కుటుంబం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో పులియూర్- ఉత్తంగరాయ్ రోడ్డుపై కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలోనే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




