న్యూఢిల్లీ: మంగళవారం లోక్‌సభ ప్రారంభమైన అనంతరం ఖట్జూ వ్యాఖ్యలపై విపక్షాలు పట్టుబట్టడంతో దానిపై చర్చ జరిగింది. యూపీఏ ప్రభుత్వ ఒత్తిడి వల్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ న్యాయమూర్తికి పదోన్నతిపై ఖట్జూ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీనిపే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ న్యాయమూర్తుల నియామక వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందని అన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీఎంకే సభ్యులు దీన్ని పట్టించుకోకుండా ఆందోళన తీవ్రం చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.