Tuesday, 3 November 2026

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం: ఎగువ కురిసిన వర్షాలతో భద్రాచలంవద్ద గోదావరి పరుగులు తీస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన భద్రాద్రి గోదారి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నిండు కుండలా 26.5 అడుగుల మట్టానికి చేరుకుంది. 10 గంటలకు 28.5 అడుగులకు, సాయంత్రం 5గంటలకు 31.5 అడుగులకు వరద నీటి మట్టం చేరుకుంది. ఇది ఇంకా కాస్త పెరిగి, అనంతరం నిలకడగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. పేరూరు వద్ద 34 అడుగుల నీటిమట్టం నమోదైంది. గతేడాది జులైలోనే ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ వర్షాల ఆలస్యంతో ఈ ఏడాది ఇప్పుడిప్పుడే జల కళను సంతరించుకుంటోంది. మరోపక్క వాజేడు మండలం చీకుపల్లి వాగు పొంగుతుండటంతో కాజ్‌వే పైకి 7అడుగుల వరకు వరద నీరు చేరింది. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *