హైదరాబాద్: రాష్ట్రంలో 15 వందల గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు సరిగా లేవని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. ఇవాళ తాండూరులో పురపాలక సంఘం సమావేశంలో మంత్రి మాట్లాడారు. రోడ్లులేని గ్రామాలకు వెంటనే రోడ్లు నిర్మిస్తామని, బస్సులు నడుపుతామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 31 బస్సు డిపోలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 8 బస్సు డిపోలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.




