హైదరాబాద్, జులై 25 : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం విద్యార్థుల హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు శిరీష, దర్శన్, ప్రశాంత్, నితుషా, శరత్, శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. రుచితాగౌడ్, ఫాతీమా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వెల్లడించారు. అలాగే మిగతా 9 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ రోజు ఏడుగురు విద్యార్థులుకు ఆపరేషన్లు చేశామని, ప్రస్తుతం వెంటిలేటర్లపై ఐదుగురు విద్యార్థులు ఉన్నారని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.




