ఢిల్లీ: నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పటాన్చెరు రైతుల కేసు విచారణ జరిగింది. ఔషధ వ్యర్థాల వల్ల నష్టపోయిన రైతుల కేసును ట్రైబ్యునల్ విచారించింది. కేసును సదరణ్ బెంచ్ నుంచి ప్రిన్సిపల్ బెంచ్‌కు బదిలీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కేసును వెంటనే ప్రిన్సిపల్ బెంచ్‌కు బదిలీ చేయడం సాధ్యం కాదని ట్రైబ్యునల్ తెలిపింది. ప్రిన్సిపల్ బెంచ్‌కు ఎందుకు బదిలీ చేయకూడదో సమాధానం ఇవ్వాలని సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ట్రైబ్యునల్ ఆగస్టు 21కు వాయిదా వేసింది.




