హైదరాబాద్, జులై 28 : రుణమాఫీపై ప్రజలకు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 80 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం విద్యుత్ కొరతను తీర్చేలా చర్యలు తీసుకోవాలని జానారెడ్డి కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటాలు, ఆందోళనలు చేస్తామని మరోనేత పొంగులేటి హెచ్చరించారు.




