Monday, 2 November 2026

ఆర్టీసీని వెంట‌నే విభ‌జించాలి

ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల నిరాహారదీక్ష
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ ఇందిరాపార్కు దగ్గర ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నుంచి యాజమాన్యం వసూలు చేసిన రూ.275 కోట్ల ను వెంటనే సహకార పరపతి సంఘానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని వెంటనే విభజించటంతోపాటు.. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ.775 కోట్ల సబ్సిడీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *