Monday, 2 November 2026

మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు

ఐదుగురి మృతి
శిథిలాల కింద 100 మంది?
మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె జిల్లా అంబెగావ్‌ తాలూకా భీమ్‌శంకర్‌నగర్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద 100 మందిదాకా చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 42 మంది సభ్యులు కల ఏడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి జేసీబీలు, అంబులెన్సులతో సహా సంఘటనాస్థలానికి తరలివెళ్లాయి. అయితే పూర్తిగా ఒక కొండే కరిగి నీరై ప్రవహించినట్లుగా ఉన్న అక్కడి బురద పరిస్థితి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. నిరంతరంగా కురుస్తున్న వాన వల్ల సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *