గ్లాస్గో: కామన్‌వెల్త్ క్రీడల్లో తెలుగమ్మాయి మత్స సంతోషికి రజతపతకం దక్కింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో నైజీరియాకి చెందిన స్వర్ణపతక విజేత అమలహా డోపింగ్‌లో పట్టుబడడంతో వూహించిన విధంగానే పతకాలు మారాయి. గతంలో రజతపతక విజేతగా నిలిచిన డికాకు ఇప్పుడు స్వర్ణం లభించింది. మత్స సంతోషికి రజతం దక్కగా మరో భారత వెయిట్ లిఫ్టర్ స్వాతిసింగ్ కాంస్యం గెలుచుకుంది. దీంతో కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 37కి చేరింది.




