Monday, 2 November 2026

ఆయా ఇంట్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

బెంగళూరు: బెంగళూరు నగరం ఆడపిల్లల తల్లిదండ్రులపాలిట బెంగ-ళూరుగా మారింది. స్కూల్లో ఆరేళ్ల పాపపై సామూహిక అత్యాచారం విషయం గత మూడు వారాలుగా నగరాన్ని కుదిపేస్తుండగా మరో ఏడేళ్ల బాలిక ఆయా ఇంట్లో అత్యాచారానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది. దినసరి కార్మికురాలిగా పనిచేసే పాప తల్లి స్కూలునుంచి పాపను ఇంటికి తీసుకురావడానికి ఒక ఆయాను ఏర్పాటుచేసింది. ఆమె పాపను తీసుకొచ్చి తన ఇంట్లో వదిలి మరో పనిమీద బయటకు వెళ్లగా 24 ఏళ్ల ఆమె కుమారుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *