
హైదరాబాద్, జూలై 30 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ టీ. ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీ అయి ట్రాన్స్ కో జేఎండీగా నియామకమయ్యారు.
బదిలీ ఐన అధికారుల వివరాలు:
– తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
– మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ప్రియదర్శిని
– ఖమ్మం కలెక్టర్‌గా ఇలంబర్తి,
– నిజామాబాద్ కలెక్టర్‌గా రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్‌గా డి వెంకటేశ్వర్‌రావు
– రేమండ్ పీటర్‌కు అపార్డ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
– స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా అమ్రాపాలీ
– ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్‌గా జె.నివాస్
– నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా ప్రీతీ మీనా
– వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా హరినారాయణ
– లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావుకు ఖరారు కాని పోస్టింగ్




