Monday, 2 November 2026

నేడు హెచ్‌ఎంలతో సవిూక్ష…రేపట్నుంచి ఇన్‌స్పైర్‌ : డిఇవో

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1:  జిల్లాలో విద్యారంగ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. మారిన సిలబస్‌తో పాటు వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు సవిూక్ష చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా  మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, సీఆర్‌పీలతో సవిూక్షించాలని డిఇవెఓ నిర్ణయించారు.  2న శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టెలికాన్ఫరెన్సు ద్వారా వీఇతో వివిధ అంశాలపై సవిూక్ష ఉంటుందని జిల్లావిద్యాశాఖాధికారి కె.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. గుణాత్మకవిద్యాభివృద్ధి కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్సులో వివరిస్తారని తెలిపారు. విధిగా అందరూ  సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఇదిలావుంటే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఇన్‌స్పైర్‌ జిల్లాస్థాయి మేళాను  ఏర్పాటు చేశారు. ఈనెల 3 నుంచి 5వ తేదీవరకు జిల్లాకేంద్రంలోని సెయింట్‌జోసెఫ్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు డిఇవో .సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. మేళా ఏర్పాట్లపై సవిూక్ష నిర్వహించారు. ఈ మేళా నిర్వహణకు 15 కమిటీలను వేసి ఆయా కమిటీలకు బాధ్యతలు అప్పగించారు.  విద్యార్థులకు సరిపడా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలికలకు హౌసింగ్‌ బోర్డులోని సరస్వతిశిశుమందిర్‌ ఉన్నతపాఠశాలలో, బాలురకు ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాలలో బస ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. లక్షెట్టిపేట, ఆదిలాబాద్‌ ఉపవిద్యాధికారి పరిధిలోని మండలాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన అవార్డు పొందిన విద్యార్థులు తప్పక హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గతంలో ఇన్‌స్ఫైర్‌ అవార్డులు పొంది మేళాకు హాజరుకాని వారు కూడా ఈమేళాలో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో మేళాలో 700కు పైగా విద్యార్థులు ప్రదర్శనలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *