Monday, 2 November 2026

డ్వామా ఇన్‌ఛార్జ్‌ పీడీ గా గణెళిష్‌ జాదవ్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1: జిల్లానీటియాజమాన్య సంస్థ(డ్వామా) పథక  ఇన్‌ఛార్జ్‌ పిడిగా వాటర్‌షెడ్‌ అదనపు పీడీ గణెళిష్‌జాదవ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత పిడి  వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వరంగల్‌ జిల్లాలో ఆర్డీవోగా పనిచేస్తున్న పాలనాధికారి జగన్మోహన్‌ సతీమణి అరుణ కొత్త పీడీగా వస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్‌ ఇక్కడకు కలెక్టర్‌గా రావడంతో ఇప్పడు ఆయన భార్య ఇక్కడకు రానున్నారని సమాచారం. ఇందుకోసమే ఈ బదిలీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్లుగా పీడీగా పనిచేస్తున్న వినయ్‌కృష్ణారెడ్డి జిల్లాను ఉపాధిహావిూ పథకం అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి జిల్లా పేరు జాతీయస్తాయిలో వినిపించేలా చేశారు. ఉపాధి హావిూలో పథకంలో చోటుచేసుకున్న అక్రమాలను మాత్రం అరికట్టలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. నెలరోజుల కిందటే బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఆయన్ను ప్రభుత్వం మాతృశాఖ అయిన రెవెన్యూకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *