Monday, 2 November 2026

అవసరాల మేరకు పురపాలక నివేదిక

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1: ఇటీవల నిర్వహించిన పురపాలిక ప్రణాళిక పూర్తయ్యింది. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా నిర్వహించిన ‘మనవార్డు-మనప్రణాళిక’ కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులతో తుది నివేదికను పూర్తి చేశారు. ఏడు పురపాలక సంఘాల పరిధిలో వ్యక్తిగత అవసరాలు మినహాయించి ఇతర మౌలిక వసతులు కల్పించడానికి అవసరమైన నిధులను కోరుతూ ప్రణాళిక రూపొందించారు.  పురపాలక పరిపాలన డైరెక్టర్‌కు ఈ నివేదికలను పంపనున్నారు. పురపాలక సంఘాల వారీగా తయారు చేసిన అంచనాలు అందులో పొందుపరిచారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా నిర్వహించిన ‘మనవార్డు-మనప్రణాళిక’ కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులతో తుది నివేదిక మేరకు  మౌలిక వసతులు కల్పించడానికి రూ.2,225.79 కోట్లు అవసరమవుతాయని అంచనాలను తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, బీఆర్జీఎఫ్‌, పురపాలక నిధులు, ఇతర నిధుల నుంచి కేటాయింపులను కూడా ఇందులో పొందుపరిచారు. పక్కా గృహాలు, సామాజిక పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇళ్ల స్థలాలను మినహాయించి ఈ మేరకు అంచనాలను రూపొందించారు. ఈ మేరకు మెప్మా పీడీ రాజేశ్వర్‌ రావు ఈ నివేదికను వెల్లడించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మందమర్రి పురపాలక సంఘాల్లో వసతుల కల్పనకు రూపొందించిన ఈ నివేదికలో 13వ ఆర్థిక ప్రణాళిక, కేంద్ర,  రహదారులు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, మురికి కాలువలు, భూగర్భ మురికి కాలువల నిర్మాణానికి, ఆట స్థలాలు, ఉద్యానవనాల అభివృద్ధి, వీది దీపాలు, ఇతర వసతుల కల్పనకు అవసరమైన నిధుల అంచనాలను ఇందులో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *