Monday, 2 November 2026

అడవుల్లో మళ్లీ అలజడి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(ఆర్‌ఎన్‌ఎ):  జిల్లాలో మళ్లీ మావోయిస్టుల సంచారం అలజడి కలిగిస్తోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోల కార్యక్లాపాలు మళ్లీ తెరపైకి రావడంతో జిల్లా వాసుల్లో ఆందోళన కలుగుతోంది. తిర్యాణి, కాసిపేట మండలాల మధ్యగల అటవీ ప్రాంతంలోని కుర్రేఘాట్‌ సవిూపంలో  పోలీసులు, మావోల మధచ్య కాల్పులు జరగడంతో గిరిజన గూడెంలలో అలజడి మొదలైంది.  దట్టమైన అటవీప్రాంతం కావడంతో మావోలు సురక్షితంగా వారోత్సవాలు జరుపుకొనేందుకు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కుర్రేఘాట్‌ అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు భావించిన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా మావోలు తారసపడి ఎదరు కాల్పులు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ కాల్పుల్లో మావోలతోపాటు కీలక నేత తప్పించుకున్నట్లు ప్రచారం ఉంది. తిర్యాణి మండల సవిూప అటవీ ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో మళ్లీ మండలంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా స్తబ్దతగా ఉన్న తిర్యాణి మండలం ఈ ఘటనతో  గిరిజనుల్లో భయాన్ని రేకెత్తించింది. గతంలో తిర్యాణి మండలం మావోలకు షెల్టర్‌జోన్‌గా వెలుగొందింది. ఈ ప్రాంతంలో మంగిదళం విస్తృత కార్యకలాపాలు సాగించి రాష్ట్ర దృష్టిని ఆకర్శించింది. గత నెలలో తిర్యాణి మండలంలో డంప్‌ దొరకడం, గురువారం అటవీ ప్రాంతంలో కాల్పులు జరగడం మరోసారి మావోప్రాభల్యాన్ని తలపిస్తుంది.మరోవైపు  దేవాపూర్‌ అడవుల్లో  జరిగిన ఎదురు కాల్పలతో జన్నారం పోలీసులు అప్రమత్తయ్యారు. ముందుగా చింతగూడ మహ్మదాబాద్‌ గ్రామాల మధ్య మధ్యాహ్నం ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి తిరిగి వాహనాలు తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో మావోయిస్టులు ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో ఆ దిశగా బస్సులను తనిఖీ చేశారు. అనుమానితులను బస్సులోంచి కిందకి దింపి పూర్తి వివరాలు అడిగి అడ్రస్‌ కాగితాలు చూసి నిర్దారణ అయ్యాకే వదిలిపెట్టారు. కార్లు, ద్విచక్రవాహనాలను సైతం వదిలిపెట్టలేదు. సాధారణ సమయంలో కంటె ఎస్సై సహా పోలీసు సిబ్బంది పూర్తి అప్రమత్తంగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *