Monday, 2 November 2026

దేవాదాయ భూమలు రక్షణకు కార్యాచరణ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1: దేవాలయ భూమలు స్వాధీనానికి రంగం సిద్దం అయ్యింది. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. దేవాదాయ ఆస్తులు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్‌ విజయరామారావు ఆదేశించారు. దీంతో కిందిస్థాయిలో ఇవోలు అందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇంతకాలం భూములను తమ స్వాధీనంలో పెట్టుకుని అనుభవిస్తున్న వారు సైతం వాటిని వదులుకోకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారు. జిల్లాలోని దేవాలయాల మాన్యాలు, ఇతర ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా సేకరించాలని ఆయన సూచించారు.  వివిధ దేవాలయాల ఈఓలు, ఇన్‌స్పెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వారికి మార్గనిర్దేశనం చేశారు. భూముల వ్యవహారంలో సిఎం కెసిఆర్‌ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.  భూములు కబ్జాకు గురయితే ఎవరి కబ్జాలో ఉన్నాయనే పూర్తి వివరాలు సర్వే చేసి సమర్పించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను ఎవరైనా కబ్జా చేసినట్లయితే వారిపై సెక్షన్‌ 38 కింద కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దేవాలయాలకు చెందిన భూములు మొత్తం 3,563 ఎకరాలు ఉన్నాయి.  ఈ భూముల వివరాల నివేదికలు త్వరలో అందజేయాలని సూచించారు. దేవాదాయ రికార్డుల్లో భూములకు సంబంధించిన వివరాలు ఒక రకంగా ఉండి, రెవెన్యూ రికార్డుల్లో మరో రకంగా కొన్ని చోట్ల ఉన్నాయన్నారు. వీటిని సరి చేయడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు. వీటి వివరాలు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *