Monday, 2 November 2026

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం

ఖమ్మం,ఆగస్ట్‌1:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరిత హారంను నూటికి నూరుశాతం పాటించేందుకు కృషిచేస్తున్నామని ఐటీడీఏ పీవో డి.దివ్య తెలిపారు. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మొక్కలు నాటడంలో ప్రతీ అధికారి శ్రద్ధ చూపాలన్నారు. ప్రతీ ఉద్యోగి ఒక మొక్కను దత్తత తీసుకుని దాన్ని సంరక్షించాలన్నారు. 190 గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో 1.28లక్షల మొక్కలు నాటాలన్న ప్రణాళిక రూపొందించామన్నారు. విద్యార్థులకు మొక్కుల నాటడంపై ఆసక్తి కలిగించాలన్నారు.  మన్యంలోని 29మండలాలు హరితభరితం కావాలని  పేర్కొన్నారు.  చుట్టుపక్కల వాతావరణం పచ్చగా కళకళలాడడం ద్వారా మానసిక ప్రశాంతత, పర్యావరణ పరిరక్షణ సమకూరుతుందన్నారు. మొక్కలను సిద్దంగా ఉంచామని ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటితే పర్యావరణం పరిరక్షించన వారం అవుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *