మెదక్,ఆగస్ట్1: వివిధ జిల్లాల కాంగ్రెస్ పరిస్థితిపై వరుస సవిూక్షలు చేస్తున్న పిసిసి శనివారం మెదక్ జిల్లా పై సవిూక్షంచనుంది. మెదక్ జిల్లాలో ఇటీవలి వైఫల్యాపై సవిూక్షించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న సమావేశాల్లో కొత్తగా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపైనా అభిప్రాయ సేకరణ జరపనున్నట్లు తెలుస్తోంది. సీఎం కెసిఆర్ సొంత జిల్లా కావడంతోపాటు ఇక్కడ ఉన్న మొత్తం పది స్థానాల్లో కేవలం రెండుస్థానాలతో మాత్రమే పార్టీ సరిపెట్టుకోవాల్సిరావడంతో అధ్యక్షుడి ఎంపిక సైతం ప్రతిష్టాత్మకంగా మారింది. తెరాసను ఎదుర్కొని పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే వారికే ఈసారి అవకాశం దక్కనుందని జిల్లా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దినెలల్లో జరగనున్న మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలపాలనే అంశంపైనా చర్చించనున్నారు. మొత్తంగా గత లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు జిల్లాలో పార్టీని బలోపేతం చేసి తెరాసను దీటుగా ఎదుర్కోవడానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉన్న భూపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఖాళీ అయిన పదవిని కూడా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని కోసం చాలా మంది పోటీ పడుతుండగా ఆగస్టు 2న గాంధీభవన్‌లో జిల్లాస్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యాన జరిగే దీనిలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, పార్టీ పరంగా ఉన్న లోపాలు తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తమ్ముడు నగేష్ షెట్కార్, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, బండి నర్సా/-నడ్ తదితరులు జిల్లా అధ్యక్షుడి పీఠాన్ని దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.




