మహబూబ్‌నగర్,ఆగస్ట్1: జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు చేపడతామని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ స్పస్టం చేశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించామని, ఓటమికి గల కారణాలను విశ్లేషించామని అన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఇపుడు సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయాల్సిన తక్షణ కర్తవ్యం మనపై ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సూచించామన్నారు. పార్టీకి నష్టం చేసినవారిని తక్షణమే సస్పెండు చేస్తామని ఆయన హావిూ ఇచ్చినట్లు కొత్వాల్ తెలిపారు. త్వరలో మండలాలు, తాలుకాలవారీగా పార్టీ సవిూక్షలు, సమావేశాలు నిర్వహించడానికి పొన్నాల ఆదేశించినట్లు చెప్పారు. పార్టీకి అంకితమై పనిచేస్తున్నవారిని గుర్తించి వారికి కొత్తగా పదవులు కట్టబెట్టాలని చెప్పినట్లు తెలియజేశారు. పొద్దుపోయేదాక జరిగిన నియోజకవర్గాల సవిూక్ష సమావేశాలు వాడివేడిగా కొనసాగాయన్నారు. . మాజీ మంత్రి డీకే అరుణతోపాటు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్ని సెగ్మెంట్ల సవిూక్షల్లో పాల్గొన్నారు. మక్తల్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల సవిూక్షలు ఆగ్రహావేశాల నడుమ జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి కారకులైన నాయకులను ఇంతవరకు ఎందుకు పార్టీ నుంచి సస్పెండు చేయడం లేదని సమావేశంలో పొన్నాలను నిదీశారని అన్నారు. పార్టీని దెబ్బతీస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించని కారణంగానే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ప్రతి అయిదేళ్లకు ఓసారి పునరావృతం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల వెన్నుపోటుదారులను.. పురపాలక, జడ్పీ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించిన జడ్పీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను.. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్సీని తక్షణమే సస్పెండు చేయాలని ఈ సందర్భంగా నేతలు టీపీసీసీ చీఫ్‌ను డిమాండు చేశారు. తెరాసలో టికెటు దక్కని ఇబ్రాహీంను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. కొత్వాల్ ఓటమికి కారకుల పేర్లు గాంధీభవన్‌కు పంపి రెండు మాసాలు గడుస్తున్నా.. బాధ్యులను ఇంతవరకు సస్పెండు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఎన్నికల్లో అటు ఏఐసీసీ గానీ, ఇటు పీసీసీ గానీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు ఒక్కపైసా ఇవ్వలేదని, ఇదెక్కడి /-పర్భాగ్యమని పలు సెగ్మెంట్ల నాయకులు టీపీసీసీ చీఫ్‌తో వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులకు నయాపైసా అందకపోవడం విడ్డూరమని, పార్టీలో ఇలా ఎప్పుడూ జరగలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంతో పనిలేకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నిర్ణయించారు.




